Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

బ్యాంకులో చోరికి విఫలయత్నం

Andhra-Bankహైదరాబాద్: కుత్భుల్లాపూర్-పేట్ బషీరాబాద్ పరిధిలోగల సుచిత్రా సమీపంలోని ఆంధ్రా బ్యాంకులో శుక్రవారం వెకువజామున దుండగులు చోరికి విఫలయత్నం చేశారు. తాళాలు పగలగొట్టి బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు సిసి కెమెరా వైర్లు కత్తిరించిండంతోపాటు హారన్‌ను మోగకుండా చేశారు. అనంతరం దొంగలు బ్యాంకులోని నగదు లాకర్‌ను తెరిచేందుకు ప్రత్నించారు. ఇంతలో బ్యాంకులో దొంగలు పడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ విషయాన్ని పసిగట్టిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా పోలీసులు వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments