Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చిదంబరం ఇంట్లో భారీ చోరీ..!

Delhi HC extends Chidambaram's interim protection till 1 August in INX Media case

చెన్నై: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత పి. చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగింది. 1.1 లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన నగలు, చీరలు దొంగలించబడ్డాయి. నూగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో ఉన్న ఆయన నివాసంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ చోరీ గురువారం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఆరోజు చిదంబరం చెన్నైలో లేరని తెలుస్తోంది. చిదంబరం సతీమణి నళినీ చిదంబరం నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి, ఆదివారం ఉదయం 7.30 గంటలకు తిరిగి వచ్చారు. అయితే, తలుపులు తాళం తీసి చూడగా చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. కాగా, ఇంతకుముందు ఇంట్లో పనిచేసిన ఇద్దరు పనివాళ్లే ఈ దోపిడీ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments