Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

చెన్నై ఓపెన్‌కు రాబర్టో అగట్, బోర్న కోరిక్

tennisచైన్నై: భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మక, పురాతన టెన్నిస్ టోర్నమంట్ ‘ఎయిర్‌సెల్ చెన్నై ఓపెన్’.  ఈ టోర్నమెంట్  22వ ఎడిషన్ జనవరి 2 నుంచి నుంగాంబక్కంలోని ఎస్‌డిఎటి టెన్నిస్ స్టేడియంలో జరుగనుంది. దీనికి ప్రపంచ 14వ ర్యాంకర్ రాబర్టో అగట్(స్పెయిన్), ప్రపంచ 48వ ర్యాంకర్ బోర్న కోరిక్(క్రోయేషియా) పాల్గొనబోతున్నారు. మూడేళ్ల తర్వాత ప్రపంచ 6వ ర్యాంకరయిన మారిన్ సిలిక్ తాను తిరిగా ఆడడానికి వస్తున్నానని ప్రకటించిన మరునాడే ఆ ఇద్దరూ తామూ పాల్గొంటున్నట్లు ప్రకటించారు. చైన్నై అభిమానులతో అగట్‌కు వ్యక్తిగతంగా మంచి టచ్ ఉంది. అతడె ఇప్పుడు ఐదోసారి చైన్నైలో ఆడబోతున్నాడు. అతడు తనకు బలమైన ప్రత్యర్థి సిలిక్‌తో తలపడనున్నాడు. ఈ ఏడాది అగట్ రెండు ఎటిపి టైటిల్స్ గెలుచుకున్నాడు. జనవరిలో ఆక్‌లాండ్ ఓపెన్, ఫిబ్రవరిలో సోఫియా ఓపెన్ కైవసం చేసుకున్నాడు. అంతేకాక అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో  నాలుగో రౌండ్ వరకు చేరుకున్నాడు. షాంఘై మాస్టర్స్ ఫైనల్స్ వరకూ వెళ్ళాడు. రాఫెల్ నాడల్ తర్వాత  స్పెయిన్ నుంచి టాప్ 20కి చేరిన 28 ఏళ్ల పిన్నవయస్కుడు అగట్. ఇక కోరిక్ కేవలం 19 ఏళ్ళున్న యువ ప్రతిభావంతుడు. 2013 యుఎస్ ఓపెన్ బాయిస ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఘనుడు. ప్రస్తుతం చైన్నైలో మూడోసారి ఆడబోతున్నాడు. ఈ సందర్భంగా టిఎన్‌టిఎ అధ్యక్షుడు అలగప్పన్ మాట్లాడుతూ “ భారత్, చైన్నైలకు మంచి టెన్నిస్ ఆనందాన్ని ఇవ్వాలన్నదే లక్షం, ఇప్పటికే టాప్ ప్లేయర్స్ ఎయిర్‌సెల్ చెన్నై ఓపెన్‌లో ఆడేందుకు సుముఖత ప్రకటించారని” అన్నారు.

Comments

comments