Home అంతర్జాతీయ వార్తలు టిక్కెట్ బుక్ చేసుకొని..

టిక్కెట్ బుక్ చేసుకొని..

us-open-women's-finalన్యూయార్క్ : మహిళల సింగిల్స్‌లో 32 ఏళ్ల ఇటలీ భామ రొబెర్టా విన్సీ.. టాప్‌సీడ్ సెరెనా విలియమ్స్‌కు షాకిచ్చి ఫైనల్‌కు చేరిన విష యం తెలిసిందే. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న సెరెనాపై విజయం సాధిస్తానని విన్సీ కూడా కలగనలేదేమో. అందుకే సెమీస్ మ్యాచ్‌కు ముందురోజే విన్సీ తన దేశానికి(ఇటలీ) విమానం టిక్కెట్లను బుక్ చేసుకొని బరిలోకి దిగింది. అయితే సెమీస్ సమరం పూర్తి అయ్యే సమయానికి వచ్చిన ఫలితం తనకే కాదు యావత్ టెన్నిస్ ప్రపం చానికీ ఆశ్చర్యం కలిగించింది. పవర్‌గేమ్‌కు పెట్టింది పేరైన సెరెనా సొంత ప్రేక్షకుల మధ్య తొలిసెట్‌ను 6-2తో నెగ్గి మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించినా.. ఆపై తడబడి 4-6, 4-6తో ఓడి క్యాలెండర్ స్లామ్ ఆశలను భగ్నం చేసుకుంది.