Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఆర్మీ రోబో

Army-robo

ఆర్మీలోకీ ఎంట్రీ ఇవ్వబోతోన్నాయి రోబోలు. రోబో సేవలను ఆర్మీలో వినియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు పరిశోధకులు. అందు కోసం రోబో సేవలను ఉపయోగించు కోవడానికి అవసరమైన కృత్రిమ మేథస్సును అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, యూఎస్ ఆర్మీ రీసెర్చ్ లేబొరేటరీకి చెందిన పరిశోధకులు ముందుగా క్రిటిక్ రూపంలో రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్‌ను నిక్షిప్తం చేశారు. అనంతరం టేలర్ అనే ఆల్గారిథమ్ ద్వారా రోబోను మాన్యువల్‌గా పరీక్షించారు. దీని ఆధారంగా మరింత మెరుగైన డీప్ టేమర్ అనే సరికొత్త ఆల్గారి థమ్‌ను రూపొందించారు. ఆ తర్వాత అటారీ గేమింగ్ సంస్థ రూపొందించిన గేమింగ్ ఆటకు సంబంధించిన 15 నిముషాల సమాచారాన్ని రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్‌ను నిక్షిప్తం చేశారు. కొత్తగా రూపొందించిన డీమ్ ఆల్గారిథమ్ ద్వారా రోబోను పరీక్షించారు. మనుషుల కంటే రోబోలే ఈ ఆటలో మంచి పనితీరును ప్రదర్శించినట్లు తెలుసుకున్నారు. వచ్చే రెండేళ్లలో మరికొన్ని రంగాల్లో డీమ్ టేమర్ ఆల్గారిథమ్‌ను పరీక్షిస్తామని యూఎస్ ఆర్మీ రీసెర్చ్ లేబొరేటరీకి చెందిన గారెట్‌వార్నెల్ తెలిపారు.

Comments

comments