Search
Wednesday 26 September 2018
  • :
  • :

అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స

Apolloమనతెలంగాణ/హైదరాబాద్ : కేవలం ఒక చిన్నగాటుతో అధునాతనమైన రోబోటిక్ వెన్నెముక శస్త్రచికిత్సను అపోలో హాస్పిటల్స్‌లో మంగళవారం నిర్వహించారు. మాజోర్ రోబోటిక్స్ అనే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొజాంబిక్ దేశపు మాజీ విదేశాంగ మంత్రి భార్యతో సహా ఎనిమిది మందికి విజయవంతంగా ఈ వెన్నెముక శస్త్రచికిత్సను జరిపారు. మాజోర్ రోబోటిక్స్ వెన్నెముకలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను (వెన్నుముక మీద ఒత్తిడిని తగ్గించడానికి హుక్స్, రాడ్స్, తీగలను బిగించడానికి చేసే శస్త్రచికిత్స) సరియైన స్థానంలో ఉంచేందుందుకు ఖచ్చితమైన మార్గనిర్దేశం చేసేందుకు ఈ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సహా దేశంలోని ఈ భాగంలో ఇటువంటి శస్త్రచికిత్సను నిర్వహించడం ఇదే మొదటిసారని డా॥ అలోక్ రంజన్ తెలిపారు. సంప్రదాయకంగా నిర్వహించే వెన్నెముక శస్త్రచికిత్సలలో ఇన్‌స్ట్రుమెంటేషన్ అనేది ఎంతో కీలకం. ముఖ్యంగా నరాలకు దెబ్బతగలకుండా స్క్రూలను స్థిరంగా ఉంచడం అనేది వెన్నెముక శస్త్ర చికిత్సా నిపుణులకు నిజంగా ఒక పెద్ద సవాలేనని చెప్పారు. అంతేకాకుండా సంప్రదాయకంగా నిర్వహించే వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత రోగి కోలుకోవడానికి 15 రోజుల నుండి నెల రోజుల సుదీర్ఘ సమయం పడుతుంది. స్థిరంగా ఉంచడానికి, సరిచేయడానికి వెన్నెముకకు శస్త్రచికిత్సను చేసిన తర్వాత తిరిగి కోలుకోవడంలో గత దశాబ్దంలో సాధించిన ఒక గొప్ప అవిష్కరణగా దీనిని చెప్పుకోవచ్చు. స్థిరత్వం కోల్పోయిన వెన్నెముకకు ఇన్‌స్ట్రుమెంటేషన్ ద్వారా మరల సరియైన స్థానంలో నరాలకు దెబ్బతగలకుండా స్క్రూలను ఉంచడం అనేది ఒక ప్రధాన సమస్య. ఈ దశలో చిన్న గాటు ద్వారా వెన్నెముకకు శస్త్రచికత్స చేయడం అనేది నిజంగా ఒక గొప్ప వరం లాంటిందని తెలిపారు..

Comments

comments