Home అంతర్జాతీయ వార్తలు రోడ్రిగో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..!

రోడ్రిగో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..!

Rodrigo Duterte controversial statement on rape

మనీలా: వివాదాలకు కేంద్ర బిందువైన ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో దుతర్తే తాజాగా మరోసారి మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రోడ్రిగో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.అందమైన యువతులు, మహిళలు ఉన్నంతవరకూ అత్యాచారాలు జరుగుతునే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. రోడ్రిగో సొంత నగరమైన డవావోలో ఇటీవలి కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనే నివేదికపై ఆయన ఇలా స్పందించారు. మనీలాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో రోడ్రిగో మాట్లాడుతూ…‘డవావో నగరంలో అత్యాచారాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. అందమైన యువతులు, మహిళలు ఎఉన్నంతవరకూ అత్యాచారాలు పెరుగుతూనే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ‘పురుషుడు కోరగానే ఏ మహిళ అయినా సెక్స్ కు ఒప్పకుంటుందా? ఒప్పుకోదు. అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి’ అని రోడ్రిగో చెప్పుకొచ్చారు. దీంతో ఆయనపై అక్కడి మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇక రోడ్రిగో ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఇదేం కొత్త కాదు. ఇంతకుముందు కూడా చాలా ఇలాగే నోరు జారారు. ఒకసారి చిన్నారులపై లైంగిక దాడులను తాను సహించబోననీ, కానీ మిస్ యూనివర్స్ పోటీల్లో గెలిచినవారిపై అఘాయిత్యాలు జరిగితే మాత్రం తనకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. అలాగే ఓ సమావేశంలో ఆర్మీని ఉద్దేశించి మాట్లాడుతూ… ‘మార్షల్ లా సందర్భంగా మీరు ముగ్గురిని రేప్ చేసిన ఫర్వాలేదు. నేను చూసుకుంటాను’ అని అసభ్యకరంగా మాట్లాడారు.