Home స్కోర్ టాప్-10లో ఫెదరర్

టాప్-10లో ఫెదరర్

roger-fedarerమెల్‌బోర్న్: ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ను గెలిచిన తరువాత ఫెడరర్ టాప్-10లో నిలిచాడు. తాజాగా విడుదల చేసిన ఎటిపి ర్యాంకింగ్స్‌లో ఫెదరర్ పదో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన పూర్వపు ఫామ్‌ను అందుకున్న ఫెదరర్, ఆ టోర్నీలో ఆత్యంత నిలకడగా రాణించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుది పోరులో ఫెడరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌పై విజయం సాధించి గ్రాండ్ స్లామ్‌ను వశపరుచుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఫెదరర్ తన అనుభవాన్ని ఉపయోగించి నాదల్‌కు చెక్ పెట్టాడు. దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. మరొకవైపు మహిళల సింగిల్స్ లో విజేతగా నిలిచిన అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ తిరిగి తన టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ గ్రాండ్ స్లామ్‌కు ముందు రెండో ర్యాంకులో ఉన్న సెరెనా, టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో నెంబర్ వన్ స్థానానికి చేరింది.