Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఆ జోడీ బౌలర్ల వెన్నులో వణుకుపుట్టిస్తారు : క్రిష్

Dwan-rohit-jodi

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పరిమిత ఓవర్లలో భారత్‌కు ఎన్నో విజయాలను అందిస్తున్నస్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్. క్రీజ్ లో  వీరిద్దరూ ఉన్నరంటే బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకుపుట్టిస్తారు. ఈ స్టార్ జోడీపై భారత మాజీ క్రికెటర్ ”క్రిష్ శ్రీకాంత్” ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ క్రికెట్లో అత్యంత కఠినమైన ఓపెనింగ్ జోడీ రోహిత్-ధావన్‌లదేనని క్రిష్ అన్నాడు. సిరీస్ విజయం కోహ్లీసేనకు కలసి వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశంమని, ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో రాణించే ఆటగాళ్లలో రోహిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. అతడులో ఫామ్‌లో ఉండటం భారత్‌కు కీలకం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల్లో టీమిండియా గెలుపు అవకాశాలు అతనిపైనే ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. ధావన్, రోహిత్ ఇద్దరూ ఫామ్‌లో ఉంటే వరల్డ్ క్రికెట్లో అత్యంత కఠిన ఓపెనింగ్ జోడీ ఇదే అవుతుందన్నారు.  వీరి బ్యాట్స్ కి బౌల్స్ విసరడం అంత సులువైన విషయం కాదన్నారు. విరాట్ ఈ లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌ను కొన‌సాగిస్తే భారత్‌కు తిరుగుండదని’ ఓ వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో క్రిష్ తెలిపాడు.

Comments

comments