Home తాజా వార్తలు అందరూ బాగా ఆడినా.. ఓటమిపై రోహిత్ శర్మ అసంతృప్తి

అందరూ బాగా ఆడినా.. ఓటమిపై రోహిత్ శర్మ అసంతృప్తి

Rohit Sharma

 

హామిల్టన్: కివీస్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపై ఆ జట్టు సారథి రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 213 పరుగుల విజయలక్షం పెద్దదే అయినప్పటికీ చివరి ఓవర్ వరకు గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచుకున్నామన్నాడు.కివీస్ బౌలర్లు ఒత్తిడిని బాగా అధిగమించగలిగారని కితాబు ఇచ్చాడు. చివర్లో యార్కర్లు వేసి తమ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందికి గురి చేశాడన్నాడు. జట్టులోని యువ క్రికెటర్లు బాగానే ఆడారని ప్రశంసించాడు. అయితే సుదీర్ఘ పర్యటనను విజయంతో ముగించలేకపోవడం నిరాశ కలిగించిందన్నాడు. ఈ పర్యటనలో చేసిన తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకొని ఆస్ట్రేలియా సిరీస్‌లో అత్యుత్తమంగా రాణించడానికి ప్రయత్నిస్తామని రోహిత్ చెప్పాడు. కాగా ఈ నెల 24నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. ఆ జట్టు తో టీమిండియా రెండు టి20లు, అయిదు వన్‌డేలు ఆడనుంది.

Rohit Sharma speaks with Media after 3rd T20 lose