Home తాజా వార్తలు అప్పుడు పాక్ బ్యాట్స్‌మెన్లకు సలహా ఇస్తా: రోహిత్

అప్పుడు పాక్ బ్యాట్స్‌మెన్లకు సలహా ఇస్తా: రోహిత్

Rohit

 

మాంచెస్టర్: వరల్డ్‌కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత గెలుపొందింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. పాక్ విలేకరుకు రోహిత్ చురకలంటించారు. పాక్ బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమవుతున్నారని, అది వాళ్లు బ్యాటింగ్ చేసే తీరులో కనిపిస్తుందని, పాక్ బాట్స్‌మెన్లకు మీరిచ్చే సలహా ఏంటని రోహిత్‌ను రిపోర్టర్ ప్రశ్నించాడు. రోహిత్ స్మైల్ ఇస్తూ… పాక్ జట్టుకు కోచ్ అయితే తప్పకుండా సలహాలు ఇస్తానని చెప్పాడు. దీంతో అక్కడున్న వారంత కొంచెసేపు నవ్వుకున్నారు. వరల్డ్ కప్‌లో రోహిత్ తొలి మ్యాచ్‌లో సెంచరీ, రెండో మ్యాచ్ హాఫ్ సెంచరీ, మూడో మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. పాకిస్తాన్‌పై ఏకంగా 140 పరుగులు చేయడంతో ఆ జట్టుపై వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. తన కూతురు సమైరా శర్మ తన కుటుంబంలోకి వచ్చిన తరువాత తాను క్రీడ జీవితంలో బాగా రాణిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఐపిఎల్‌లో కూడా ముంబయి జట్టుకు ఐపిల్ ట్రోఫీని అందించిన విషయం తెలిసిందే.

 

Rohit Sharma Was Asked to Give Advice to Pak Batsmen