Home స్కోర్ రోహిత్‌కు కష్టమే: అజహర్

రోహిత్‌కు కష్టమే: అజహర్

azaruddinముంబయి: గాయాల వల్ల చాలా కాలం జాతీయ జట్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మకు చాంపియన్స్ ట్రోఫీలో కష్టాలు తప్పకపోవచ్చని టీమిండియా మాజీ కెప్టె న్ మహ్మద్ అజాహరుద్దీన్ అభిప్రాయప డ్డాడు. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్ లో ఓపెనర్‌గా రాణించడం రోహిత్ సులు వు కాదన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌లో కూడా రోహిత్ బ్యాటింగ్ అంతంత మాత్రమేనన్నాడు. ఈ పరిస్థితు ల్లో వన్డేల్లో పూర్వవైభవం సాధించడం రోహిత్ అనుకున్నంత తేలిక కాదన్నాడు. ఇంగ్లాండ్ పరిస్థితులు కూడా రోహిత్‌కు ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయ న్నాడు. బౌన్సీ పిచ్‌లపై మెరుగైన బ్యాటిం గ్‌ను కనబరచడం చాలా కష్టమన్నాడు. ఈ నేపథ్యంలో అంతంత మాత్రం ఫాంతో సతమతమవుతున్న రోహిత్ ఎలా ఆడుతా డో అంతుబట్టడం లేదన్నాడు. అతన్ని ఓపె నర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో దింపితేనే ప్రయోజనంగా ఉంటుందని అజర్ సూచించాడు.