Home జాతీయ వార్తలు రోహిత్ ఆత్మహత్య  నిరసనకారులను  చితకబాదిన ఢిల్లీ పోలీసులు

రోహిత్ ఆత్మహత్య  నిరసనకారులను  చితకబాదిన ఢిల్లీ పోలీసులు

rohitన్యూఢిల్లీ: ఒన్.. టూ.. త్రీ ఛార్జ్ అంటూ ఢిల్లీ పోలీ సులు ఉన్నట్టుండి ప్రదర్శకులపై లాఠీలతో విరుచు కు పడ్డారు. మగ ఆడ తేడా లేకుండా ఇష్టం వచ్చి నట్లుగా చితకబాదారు. తలలకు గురిపెట్టి కొట్టా రు. జట్టు పట్టుకుని ఈడుస్తూ నేలపైకి విసిరికొట్టి ఆనక వారిని ఈడ్చుకుంటూ వెళ్లి కక్ష తీర్చుకు న్నారు. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఇక్కడి ఆర్‌ఎ స్‌ఎస్ కార్యాలయం వెలుపల ప్రదర్శకులు గుమి కూడిన సమయంలో పోలీసులు వ్యవహరించిన మితిమీరిన చర్యలను కళ్లకు కట్టినట్లు తెలిపే వీడి యో క్లిప్పింగ్‌లు ఇప్పుడు సామాజిక మాధ్యమం లో వెల్లువెత్తాయి.ఖాకీ దుస్తుల పోలీసులతో పాటు మామూలు దుస్తులలో ఉన్న వారు కూడా కర్రలు పట్టుకుని వచ్చి ప్రదర్శనకులపై దౌర్జన్యం జరిపిన ట్లు తెలిపే వీడియో ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. పోలీసులు సాగించిన దౌర్జ న్యకాండ కాంక్రీట్‌జంగిల్‌లో పులి లేడి వేటను తలపించాయి. బిజెపి సైద్ధాంతిక గురువు ఆర్‌ఎ స్‌ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద ఎలాంటి అవాం ఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి నిత్యం భద్రతా ఏర్పాట్లు ఉండటం సాధారణమే. అయితే శనివారం దళిత సంఘాలు ఇతర సామాజిక సంస్థలు, విద్యాసంస్థలు దళిత విద్యార్థి ఆత్మహత్య ను ఖండిస్తూ సాగించిన ర్యాలీ రక్తసిక్తం అయ్యేలా పోలీసులు అసాధారణ రీతిలో తమ కర్తవ్యాన్ని ఇక్కడ అతిగా నిర్వహించినట్లు వెల్లడైనట్లు నెటిజ న్లు స్పందించారు. నిరసనకారులను ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం దరిదాపుల్లోకి కూడా రాకుండా చేసేందుకు పోలీసులు తమ బలప్రదర్శన కావించి నట్లు వీడియో సాక్షాలు వెలువడ్డాయి. తోటి నిర సనకారుడిని అదేపనిగా కొడుతున్న ఓ పోలీసును ఆపు అంటూ ఓ మహిళాకార్యకర్త అరిచిన సంద ర్భంగా ఈ పోలీసు వెంటనే ఆమెను నేలకు విసిరి కొట్టినట్లు వెల్లడైంది. ఓ వ్యక్తి పోలీసు అవునో కాదో తెలియదు కానీ మామూలు దుస్తులలో ఉం డి ఓ నిరసనకారుడిని గట్టిగా పట్టుకుని చితకబా దడం వీడియోలో ఉంది. ఈలోగా ఇద్దరు పోలీ సులు వచ్చి తాము కూడా ఆ వ్యక్తిని చితకబా దారు. పోలీసులతో కలిసి దౌర్జన్యం సాగించిన వ్య క్తి ఎవరనేది వెల్లడి కాలేదు. అయితే తమ వారు ఎవరూ దాడికి దిగలేదని ఆర్‌ఎస్‌ఎస్ వారు వివ రణ ఇచ్చుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఝాండే వాలాన్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం వెలుపల శనివారం ప్రదర్శకులు నిరసన వ్యక్తం చేసేందుకు గుమికూడిన సమయంలో వారిని అణచివేసేందు కు సాగిన ఘటనలు పలు ప్రశ్నలకు దారితీస్తు న్నాయి. ‘ఎలాంటి హెచ్చరికలు లేవు. ఉన్నట్టుండి పోలీసులు ఒన్ టు త్రీ అంటూనే ఛార్జీ చెప్పి దాడి కి దిగారు. ప్రదర్శకులు తేరుకునేలోపునే వారిపై లాఠీదెబ్బలు పడ్డాయి’ అని ఇండిపెండెంట్ జర్నలి స్టు రాహుల్ చెప్పారు. వార్తా సేకరణకు ఆయన ఆరోజు పోలీసుల వద్ద ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. లాఠీచార్జీని కెమెరాతో ఫోటో తీస్తుండగా దానిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకువెళ్లారని జర్నలిస్టు రాహుల్ పేర్కొన్నారు.