Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

రోహిత్ దళితుడే…కాదనడం సరికాదు

రూపన్‌వాలా నివేదికను త్రోసిపుచ్చిన జాతీయ ఎస్‌సి కమిషన్ 

rohithన్యూఢిల్లీ : హెచ్‌సియూలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి వేముల రోహిత్ దళిత కులస్తుడు కాదనే రూపన్‌వాలా కమిషన్ నివేదికను తోసి పుచ్చుతున్నట్లు జాతీయ ఎస్‌సి కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) చైర్మన్, పార్లమెంట్ సభ్యుడు పిఎల్ పుణియా స్పష్టం చేశారు. రోహిత్ దళితుడు కాదని , వడ్డెర (బిసి) కులం వాడని సదరు కమిషన్ నివేది క ఇచ్చినట్లుగా వచ్చిన వార్తలు సంచలనానికి దారితీశాయి. అయితే ఈ నివేదిక పూర్తిగా అవాస్తవం అని, దీనిని తోసిపుచ్చుతున్నట్లు ఎసి కమిషన్ ఛైర్మన్ పుణియా గురువారం తెలిపారు. చట్టబద్ధమైన సంస్థలతో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్ తమ వేర్వేరు నివేదికల లో ఈ విద్యార్థి దళిత కులానికి చెందిన వారని పేర్కొన్నట్లు , వారి నిర్థారణల్లో ఈ విషయం స్పష్టం అయినట్లు , ఆయన ఒబిసికి చెంది న వాడనేది నిజం కానట్లు పుణియా తెలిపారు. రోహిత్ విషాదాం తంపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన కీలక అంశాలను పక్కకు పెట్టారని, ఇప్పుడు వేముల దళితుడు కాదనే నివేదికను ప్రచారంలోకి తెస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసు కోవడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశంలో దళిత విద్యా ర్థులపై ఇతర వర్గాల నుంచి తీవ్ర వేధింపులు వ్యక్తం అవుతున్నాయ ని, వారు మానసికంగా కుంగిపోతున్నారని ఇందులో భాగంగానే రోహిత్ విషాదాంతం జరిగిందని విమర్శలు వెలువడ్డాయి. అయితే ఘటన జరిగినప్పటి నుంచి కూడా బిజెపి మంత్రులు, నాయకులు రోహిత్ దళితుడు కాడనే ప్రచారానికి దిగుతున్నారని దీనిని తగు విధంగా సమర్థించుకునేందుకే ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లుగా ఉందని, ,చట్టబద్ధమైన సంస్థలు, జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలను కాదని ఈ కమిషన్ ఈ నిర్థారణకు ఎలా వస్తుందని కాంగ్రెస్ ఎంపి అయిన పుణియా విమర్శించారు. దళిత స్కాలర్ ఆత్మహత్య బాధా కరం, దురదృష్టకరం అని , వర్శిటీలో ఓ విద్యార్థి తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోవడం ఎవరినైనా కదిలించే అంశం అవుతుందని చెప్పారు.  రోహిత్ ఆత్మహత్య ఘటన పట్ల తీవ్రస్థాయి లో నిరసన వ్యక్తం కావడంతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశా ఖ స్పందించి , ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణకు రిటైర్డ్ జస్టిస్ ఎకె రూపన్‌వాలా సారధ్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిషన్ వారు ఇంతకూ ఈ విద్యార్థి దళితుడే కాదని తేల్చినట్లు నివేదికను అందించినట్లు వెల్లడైంది.

Comments

comments