Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ధోనీ రికార్డును అధిగమించిన రోహిత్‌శర్మ

Rohith-Sharma

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్-2017)లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ వేదికగా రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపిఎల్ 10 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో రోహిత్‌సేన పుణెపై ఒక పరుగుతో విజయం సాధించి ఐపిఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత క్రికెటర్లలో అత్యధిక టి20 ట్రోఫీలు అందుకున్న ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

ఐపిఎల్ చరిత్రలో వరుసగా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకున్న తొలి జట్టుగా ముంబయి కొత్త చరిత్ర సృష్టించింది. తాజా విజయంతో మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, అంబటి రాయుడుల రికార్డులను రోహిత్‌శర్మ అధిగమించేశాడు. ఉప్పల్ వేదికగా ఆదివారం పుణెపై సాధించిన టైటిల్ రోహిత్‌కు ముంబయి తరపున మూడో టైటిల్ కాగా, కెరీర్‌లో అతనికి ఇది ఏడో టి20 టైటిల్ కావడం విశేషం. ప్రపంచకప్ టి20, ఆసియా కప్ టి20, ఐపిఎల్ టోర్నీలో మొత్తం నాలుగుసార్లు ఆడగా, అందులో ముంబయి ఇండియన్స్ తరపున మూడు సార్లు, డెక్కన్ ఛార్జర్స్ తరపున ఒకసారి రోహిత్ ఆడాడు.

Comments

comments