Home తాజా వార్తలు వ్యసనాలే ఇతివృత్తంగా…

వ్యసనాలే ఇతివృత్తంగా…

Romantic Criminalsఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి సందేశాత్మక కమర్షియల్ హిట్ చిత్రాలను అందించిన పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని తుది మెరుగులు దిద్దుకుంటోంది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి పిక్చర్స్, శ్రావ్య ఫిలింస్ బ్యానర్‌లపై ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బి.బాపిరాజు మాట్లాడుతూ “ఈ చిత్రం షూటింగ్ వైజాగ్‌లో జరిగింది. యువతను పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే చిత్రమిది. మనోజ్‌నందన్, అవంతిక, దివ్య, మౌనిక హీరోహీరోయిన్లుగా చక్కటి నటన కనబరిచారు”అని అన్నారు. దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్రంలో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది. విశాఖ, అరకులోని అందాలే కాకుండా గంజాయ్ తోటల్లో పోలీసులు దాడి చేసే సన్నివేశాలను చాలా చక్కగా తెరకెక్కించాము. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం”అని తెలిపారు.

Romantic Criminals Movie Completes Shooting