Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

చిన్నారిని ఓదార్చిన క్రిస్టియానో రొనాల్డో !

ronld

మాస్కో: ప్రపంచ ఫుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డో, లియోనాల్ మెస్సీ వంటి స్టార్ ఆటగాళ్లకున్నా క్రేజు అంతాయింతా కాదు. వీరిని ఆట చూడాలని.. కుదిరితే ఓ ఫొటో  దిగాలని అభిమానులంతా ఆశిస్తుంటారు. ఈ క్రమంలో ఓ చిన్నారి తన అభిమాన ఆటగాడైన రొనాల్డోను చూసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. తన తల్లితో సహా వచ్చి రొనాల్డో కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని  అక్కడే ఉన్న భద్రతాసిబ్బందిని బ్రతిమాల సాగాడు. సిబ్బంది ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఆ చిన్నారి తట్టుకోలేక ఏడవటం మొదలుపెట్టాడు. సిబ్బంది కుదరదని ఎంత చెప్పిన ఆ పిల్లాడు మాత్రం ఏడుపు మానలేదు. అయితే ఇదంతా బస్సులో నుంచి గమనించిన రొనాల్డో నేరుగా అతడి దగ్గరికి వచ్చేశాడు. ఏడుస్తున్న ఆ చిన్నారిని దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు. అతని టీ-షర్టు మీద ఓ ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చేశాడు. ఇక ఆ పిల్లాడిని ఓదార్చడానికి ఓ ముద్దు కూడా పెట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అప్పటి వరకూ ఏడుస్తూనే ఉన్న ఆ చిన్నారికి  రొనాల్డోను చూసేసరికి  ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇదిలా ఉండగా ప్రపంచకప్‌లో భాగంగా పోర్చుగల్ తన తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడిన సంగతి తెలిసిందే. రొనాల్డో హ్యాట్రిక్ గోల్‌తో రెచ్చిపోయి ఆడినా స్పెయిన్‌తో మ్యాచ్‌ను 3-3తో డ్రాగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోర్నీలో భాగంగా పోర్చుగల్ బుధవారం మొరాకోతో తలపడనుంది.

Comments

comments