Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

గుడ్లపై పొదిగిన కోడిపుంజు

                    Hen

పాల్వంచ : పాల్వంచలో వింత సంఘటన చోటుచేసుకుంది. మాములుగా కోడిగుడ్లపై కోడిపెట్ట పొదుగుతుంది. కాని పట్టణ పరిధి ఇందిరాకాలనీలోని అడ్వకేటు గంగాధర్ ఇంట్లో ఉన్న కోడిపుంజు కోడి పెట్టిన గుడ్లపై పొదుగుతుంది. గుడ్లను పొదగడమే కాదు గుడ్ల దగ్గరికి ఎవరైనా వస్తే వారి మీదకు
వస్తూ పొడుస్తుంది. ఇది గత వారం రోజులుగా వస్తుందని గంగాధర్ చెబుతున్నారు. పెట్టల సంయోగనానికి వరంగల్ నుంచి కోడిపుంజును తీసుకువచ్చామని కానీ కోడిపుంజు అందుకు విరుద్దంగా కోడిగుడ్లపై పొదుగుతుంది. ఇది ఆ నోటా ఈ నోటా ప్రచారం కావడంతో కోడిపుంజును చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి చూస్తున్నారు.

Comments

comments