Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

చర్మసౌందర్యాన్ని పెంచే గులాబి

rose-girlఅమ్మాయిల అందాన్ని రెట్టింపు చేసేందుకు గులాబీ రేకులు అద్భుతంగా పనిచేస్తాయి. పురాతనకాలం నుంచి గ్రీకులు, రోమాన్‌లు సౌందర్యసాధనాల్లో వీటని ఉపయోగించేవారని చర్రిత చెబుతుంది. శతాబ్దకాలాల నుంచి వీటిని కాస్మొటిక్స్ తయారీలో వాడుతున్నారు. ఇందులో చర్మసౌందర్యాన్ని పెంచే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
* గులాబీ రేకుల్లో మొటిమలు, మచ్చలను నివారించే యాంటీ బ్యాక్టీరియల్ ఎసెన్షియల్ ఆయల్ ఉంటుంది. అందుకే వీటితో తయారుచేసే రోజ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుంటే.. నిగారింపైన చర్మం మీ సొంతం అవుతుంది.
* ఈ రేకులను నీటో రెండు మూడు గంటలు నానబెట్టి, తర్వాత పేస్టులా చేసి, అందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దాన్ని 15 నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ గంధ్రులను రక్షణ కల్పిస్తాయి.
* గులాబీలో ఉండే సహజ సిద్ధమైన నూనె చర్మం తేమ కోల్పోకుండా సహాయపడుతుంది. చర్మాన్ని కోమలంగా మారుస్తుంది.
* ఆరోమాటిక్ రోజ్‌ను ఉపయోగించడం వల్ల ఇది మనస్సుకు ప్రశాంతతకు కలిగిస్తుంది. అందుకే వీటిని ఆయుర్వేదిక్ మందులలో ఉపయోగిస్తున్నారు.

Comments

comments