Home మన ఆరోగ్యం రఫ్ గా బ్రష్ చేసుకుంటే చిగుళ్లకు హాని

రఫ్ గా బ్రష్ చేసుకుంటే చిగుళ్లకు హాని

Rough brush can damage the gums
దంత ఆరోగ్యం చాలా ముఖ్యం. దంత సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ మధ్య చాలా మందికి దంతాలకుసంబంధించిన అవగాహన పెరిగిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మధుమేహరోగులు. మా దగ్గరకు వచ్చే వారిలో ఎక్కువగా డయాబెటిక్ రోగులు ఉంటుంటారు. దంతాలను ఎలా పడితే అలా బ్రష్ చేసుకోకూడదు. ఆర్నెల్లకోసారి డెంటిస్ట్‌ను కలవాలంటున్నారు దంతవైద్యులు.  

దంత రక్షణకు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలో చూద్దాం..
1 ప్రతిరోజూ రెండు సార్లు పళ్లు తోముకోవాలి. (రాత్రి నిద్రకు ముందు, పొద్దున్న నిద్ర లేవగానే)
2 బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడాలి.
3 మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవాలి.
4 పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకూ నిలువుగా బ్రష్ చేసుకోవాలి.
5 రఫ్‌గా బ్రష్ చేసుకుంటే చిగుళ్లకు హాని కలుగుతుంది. దీంతో చిగుళ్లు త్వరగా వ్యాధులకు గురవుతాయి.
6 పంటికి బయటవైపే కాదు లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాల్లో పంటి పైన వెడల్పుగా ఉండే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి.
7 కనీసం రెండు నిముషాలపాటు బ్రష్ చేసుకోవాలి.
8 నాలుకపైన ఉన్న బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి 30 సెకన్లపాటు స్క్రబ్ చేయాలి.
9 చేత్తో చిగుళ్లను మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది.
10 ప్రతి మూడు నెలలకు ఓ సారి బ్రష్‌ను మార్చేయాలి. బ్రిజిల్స్ వంగినట్లు, దెబ్బతిన్నట్లు అనిపించినా వెంటనే కొత్త బ్రష్ ఉపయోగించాలి.
11 బ్రష్‌ను టాయిలెట్ దగ్గర పెట్టకండి. బ్రష్ చేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి కప్‌బోర్డ్‌లో పెట్టాలి.
12 చిన్నపిల్లలు ఉన్నవారు ప్రతి 6 నెలలకోసారి వారిని డెంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి.
13 పాలపళ్లే కదా అని అనుకోవద్దు. వాటిల్లోని ఇన్‌ఫెక్షన్స్ , శాశ్వత దంతాలకు వ్యాపిస్తాయి.
14 దీంతో ఎగుడుదిగుడు పళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
15 పాలపీకతో పాలుతాగే పిల్లలకు రాత్రి పూట నిద్రకుముందు పీకను నోట్లోంటి తీసేయండి.
16 వేలితో నోటిని శుభ్రం చేయాలి.
17 సీసాను అలాగే ఉంచేస్తే అన్ని పళ్లూ పిప్పిపళ్లు అయ్యే అవకాశం ఉంది.
18 ఆడుకునే సమయంలో పిల్లలు మౌత్‌గార్డ్ వాడేలా చూడండి.
19 దంతాలు శుభ్రంగా లేకుంటే అక్కడి బ్యాక్టీరియా గుండెకు పాకి, గుండెజబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంది.
20 హార్ట్‌ఎటాక్ ఉన్నవారు గుండె ఆపరేషన్‌కు ముందు దంతాలకు సంబంధించిన వ్యాధులేమీ లేకుండా చూసుకోవాలి.
21 మధుమేహ రోగులు తప్పనిసరిగా దంత వైద్యులను క్రమం తప్పకుండా సంప్రదించాలి.
22 లేకుంటే పళ్లు కదలడం, నోటి దుర్వాసన, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్, నోరు ఎండిపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
23 గర్భిణులు హార్మోనల్ మార్పుల వల్ల చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్‌కు గురవుతుంటారు. వాటిని నివారించకుంటే తల్లికి కడుపులోని బిడ్డకూ హాని జరిగే అవకాశం ఉంది.
24 వృద్ధులకు వారి వయసును బట్టి తీసుకునే మందుల వల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల పిప్పిపన్ను, చిగుళ్ల వ్యాధి రావచ్చు. వారు తరచూ డెంటిస్ట్‌ను కలవాలి.
25 పళ్లు లేనివారు కృత్రిమ దంతాలను అమర్చుకోవాలి. లేకుంటే ఆహారాన్ని సరిగ్గా నమల్లేక పోవడం వల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి.
నోట్లో షార్ఫ్ టీత్ ఉంటే వాటి పదును తగ్గించాలి. లేకుంటే నాలుక లేదా బుగ్గ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది.
26 పొగ తాగడం, పాన్‌పరాగ్ నమలడం, వక్కపొడి తరచుగా తినడంలాంటివన్నీ నోటి క్యాన్సర్ కారకాలు. వీటిని మానెయ్యాలి.