Home జాతీయ వార్తలు రౌడీషీటర్ దారుణ హత్య

రౌడీషీటర్ దారుణ హత్య

MURDERగుంటూరు: జిల్లాలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. తాడేపల్లి మండలం పాతూరు వద్ద సోమవారం అర్థరాత్రి తర్వాత ఓ వ్యక్తిని ప్రత్యర్థులు అతికిరాతకంగా హతమార్చి కృష్ణానదిలో పడేశారు. కాగా, మృతుడిని స్థానికులు కొల్లూరుకు చెందిన రౌడీషీటర్ నాగరాజుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.