Home తాజా వార్తలు ఫలక్‌నుమాలో రౌడీషీటర్ హత్య

ఫలక్‌నుమాలో రౌడీషీటర్ హత్య

rowdy-sheter

మన తెలంగాణ/ హైదరాబాద్/ చాంద్రాయణగుట్ట : అక్రమ సంబంధం ఒక రౌడీషీటర్ హత్యకు దారి తీసింది. ఫలక్‌నుమా పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం.. ఫలక్‌నుమా అచ్చిరెడ్డినగర్‌కు చెందిన సయ్యద్ ఈసా (30) ఫలక్‌నుమా పోలీ సుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదై ఉన్నాడు. జహ నుమా, మదీనా కాలనీకి చెందిన వాహెద్ ఖాన్ గత ఏడాదిన్నర క్రిందట దుబాయ్‌కి వెళ్ళాడు. అప్ప డప్పుడు హైదరాబాద్‌కు వచ్చి వెళుతుం టాడు. అయితే ఇతని భార్య సహా బేగంతో రౌడీషీటర్ ఈసాకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈవిషయాన్ని ఈసా దుబాయ్‌లో ఉంటున్న సహా బేగం భర్త సెల్‌ఫోన్‌కు మెసేజ్ పెడుతున్నాడు. తరచూ మెసేజ్‌లు వస్తుండటంతో అతడు మదీనా కాలనీలో ఉండే తన సోదరులు జావేద్ ఖాన్ (30), నవీద్ ఖాన్ (25)లకు ఆ సమాచారాన్ని పంపించాడు. దీంతో వారు విషయం వాస్తవమా, కాదా అని నిఘా పెట్టారు. వదిన, రౌడీ షీటర్ మధ్య అక్రమ సంబంధం నిజమని తేలటంతో గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో వట్టేపల్లి బీబీకా చష్మా, మామూకీ పాన్‌షాప్ వద్ద ఈసా ఉన్నాడని తెలుసుకొని ఇరువురు సోదరులు అక్కడికి వెళ్ళారు. వీరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అందుకు ఈసా ససేమిరా అనటంతో పాటు ఏం చేసుకుంటారో చేసుకో మ్మని ఖరాఖండిగా చెప్పేశాడు. అందుకు ఆగ్రహించిన నవీద్ ఖాన్ తన వద్ద ఉన్న జంబియాతో రౌడీషీటర్ ఈసా ఛాతిలో బలంగా పొడిచాడు. దీంతో అతడు అక్కడి కక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న ఫలక్‌నుమా ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఇన్‌స్పెక్టర్ యాదగిరి అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.