Home తాజా వార్తలు రౌడీషీటర్ హత్య

రౌడీషీటర్ హత్య

Murder

పెద్దపల్లి : గోదావరిఖని పట్టణానికి చెందిన ఆరుకోళ్ల శ్రీను అలియాస్ బుగ్గల శ్రీను(40)ను దుండగులు ఆదివారం దారుణంగా హత్య చేశారు. 2010లో జరిగిన కానిస్టేబుల్ ఎర్రగోల్ల రమేష్ హత్య కేసులో శ్రీను ప్రధాన నిందితుడు. దీంతో శ్రీనుపై గోదావరిఖని పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. కానిస్టేబుల్ హత్య కేసులోనే కాక మరికొన్ని హత్యల్లో కూడా శ్రీను ప్రధాని నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. గోదావరిఖని ఉదయ్‌నగర్‌లో శ్రీను ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఆటోలో వచ్చిన దుండగులు శ్రీను ఇంటికి వెళ్లి అతడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీను అక్కడికక్కడే చనిపోయాడు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Rowdy Sheeter Murder in Godavarikhani