Home జిల్లాలు రౌడీషీటర్ వాహేద్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

రౌడీషీటర్ వాహేద్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

medakజహీరాబాద్ : జహీరాబాద్ శివారులో ఇటీవల జరిగిన బోడబండకు చెందిన వాహేద్ పహిల్వాన్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపి నట్లు సంగారెడ్డి డిఎస్పీ ఎం.తిరుపతన్న తెలిపారు. జహీరా బాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బోరబండకు చెందిన రౌడీషీటర్ రహీంకు బోరబండకు చెందిన మరో రౌడీషీటర్ వాహేద్ పహిల్వాన్ మద్య సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలు ఇతర విషయాల్లో గొడవలు జరిగేవి. దీంతో రహీం తన అనుచరులైన బోర బండకు చెందిన ఫిరోజ్, ఆఫాన్,అంజద్,షాదాబ్, సయీద్, అసద్, ఫతేఖాన్‌లు కలిసి జహీరాబాద్ శివారులోని బీదర్‌కు చెందిన ఫిరోజ్ ఫాంహౌజ్‌లో రౌడీ షీటర్ వాహేద్ పహిల్వా న్‌ను హత్య చేయడానికి పథకం పన్నారు. జహీరా బాద్‌కు చెందిన ఇనాయత్, బీదర్‌కు చెందిన ఫాంహౌజ్ యజమాని ఫిరోజ్‌ల సాయంతో జహీరాబాద్‌లోని ఫాంహౌజ్ లో పథకం ప్రకారం దావత్ ఏర్పాటు చేసి వాహేద్ పహి ల్వాన్‌ను ఈనెల 7వ తేదీన పిలిపించారు. అనంతరం వారు కత్తులు, చాకులు, పైపులతో దాడి చేసి వాహేద్‌ను హత్య చేశారు.
కాగా శుక్రవారం ఉదయం 6 గంటల సమయం లో జహీరాబాద్ పట్టణ, రూరల్ సిఐలు, పోలీసులు అల్లానా చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా ఇన్నోవా కారు నంబరు ఎపి 16డిఎల్ 0385 లో వెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, పైపులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు డిఎస్పీ తిరుపతన్న తెలిపారు. ఫాంహౌజ్ యజమాని ఫిరోజ్ పరారీలో ఉన్నాడని ఆయన వెల్లడించారు.