Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య..!

Rowdy Sheeter murdered In Visakhapatnam,

అమరావతి: ఎపిలోని విశాఖపట్నంలో ఓ రౌడీషీటర్ ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నడిరోడ్డుపై నరికి చంపారు. కాశీం అనే రౌడీషీటర్ ను దుండగులు అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి చంపేశారు. ద్విచక్రవాహనాలపై వెంబడించిన దుండగులు కాశింను నడిరోడ్డుపై మట్టుపెట్టారు. కాశీం చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, పాత గొడవల వల్లే దుండగులు కాశీంను హత్య చేసి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments