సికింద్రాబాద్: అల్వాల్‌లో రౌడీషీటర్ నవీన్‌యాదవ్ దాష్ఠీకం ప్రదర్శించాడు. తనకు నెలకు రూ. 10వేలు మాములు ఇవ్వలేదని శ్యామ్ అనే వ్యక్తికి చెందిన దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో దుకాణంలో ఉన్న డీజిల్ డబ్బా పేలడంతో రౌడీషీటర్ నవీన్‌యాదవ్ గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. షాప్ యాజమాని ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.