Home తాజా వార్తలు యువతిపై రౌడీషీటర్ అత్యాచారం!

యువతిపై రౌడీషీటర్ అత్యాచారం!

Rowdy sheeter Rape a Girl in Hyderabad

హైదరాబాద్: వారాసిగూడ పరిధిలోని అంబర్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై రౌడీషీటర్ అమీర్ గత మూడు రోజులుగా అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో  బాధిత యువతి స్థానికుల సహాయంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, యువతిని ఆరోగ్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాంతో రౌడీషీటర్ అమీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.