Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మళ్లీ ఓడిన కోహ్లి సేన

  • సందీప్ మ్యాజిక్, అక్షర్ ఆల్‌రౌండ్ షో, బెంగళూరుకు పంజాబ్ షాక్

KXIP-Won

బెంగళూరు: ఐపిఎల్ పదో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో పరాజయాన్ని చవిచూసింది. శుక్రవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 19 పరుగుల తేడా తో కింగ్స్ లెవన్ పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. తర్వాత స్వల్ప లక్షంతో బరిలోకి దిగిన బెంగళూరు 19 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలి మరో పరాజయాన్ని మూట గట్టుకుంది. బెంగళూరుకు ఇది తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రతిభతో పంజాబ్‌ను గెలిపించాడు. సందీప్ శర్మ మూడు కీలక వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు. అద్భుత బౌలింగ్ కనబరిచిన సందీప్ తొలి ఓవర్‌లోనే ప్రమాదకర ఆటగాడు గేల్ (0)ను పెవిలియన్ పంపించాడు. అంతేగాక కోహ్లి (6), డివిలి యర్స్ (10)లను కూడా సందీప్ ఔట్ చేశాడు. దీంతో బెంగళూరు మళ్లీ కోలుకోలేక పోయింది. సందీప్ శర్మకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఓపెనర్లు వెంటవెంటనే..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ లెవన్ పంజాబ్ కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ హాషిం ఆమ్లా (౩) మొదటి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. అంకిత్ చౌదరి అద్భుత బంతికి ఆమ్లా వికెట్ల వెనుక దొరికి పోయాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ కూడా వెనుదిరిగాడు. భారీ ఆశలు పెట్టుకున్న గుప్టిల్ 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 18 పరు గుల వద్దే ఓపెనర్లను కోల్పోయింది. ఈ సమయంలో షాన్ మార్ష్ కొద్ది సేపు మెరుపులు మెరిపించాడు. ధాటిగా ఆడిన మార్ష్17 బంతుల్లో మూడు ఫోర్లతో 20 పరుగులు చేశాడు. అయితే పవన్ నేగి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. తర్వాత బెంగళూరు కచ్చిత మైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో పంజాబ్ స్కోరు నత్తను తలపించింది. అంకిత్ చౌదరి, చాహల్ అద్భుత బౌలింగ్‌తో పంజా బ్‌ను కట్టడి చేశారు. చివర్లో అక్షర్ పటేల్ ధాటిగా ఆడడంతో పంజాబ్ కాస్త తేరుకుంది. చెలరేగి ఆడిన అక్షర్ 17 బంతుల్లోనే ౩ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో మన్నాన్ వోహ్రా (25), వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (21) పరుగులు చేశారు. దీంతో బెంగళూరు స్కోరు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులకు చేరింది. బెంగళూరు బౌలర్లలో చాహల్, అంకిత్ చౌదరి రెండేసి వికెట్లు పడగొట్టారు.

Comments

comments