Search
Wednesday 21 November 2018
  • :
  • :

మడతబెట్టే స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేసింది..

plexpie-smartphone

బీజింగ్: చైనాకు చెందిన రాయొలే కార్పొరేషన్ మడతబెట్టే స్మార్ట్‌ ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లో విడుదల చేసింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ఫోన్‌గా రికార్డులకెక్కింది. మినీ ట్యాబ్‌ను పోలి ఉండే ఈ ఫోన్‌ను సగానికి మడతపెట్టేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే సైజ్ 7.8 ఇంచులు ఉంటుంది. మడిచిన తరువాత ఇది రెండు డిస్‌ప్లేలు ఉన్న ఫోన్‌లాగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌ను మడతపెట్టినప్పుడు 20 ఎంపి కెమెరా సెల్ఫీ కెమెరాగా మారిపోతుంది. ప్రయోగ దశలో ఈ ఫోన్‌ను 2 లక్షలసార్లు మడతపెట్టి పరీక్షించాకే మార్కెట్‌లోకి విడుదల చేశామని రాయొలే కంపెనీ తెలిపింది.

‘ఫ్లెక్స్‌పై’ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.90 వేలుగా తెలుస్తుంది. అమెరికా మార్కెట్లో ఇప్పటికే ఈ ఫోన్‌కు ప్రీ ఆర్డర్లు మొదలయ్యాయి. డిసెంబరులో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. కాగా, ఈ ఫోన్ ను ఇతర దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చే వివరాలను వెల్లడించలేదు. శాంసంగ్, ఎల్‌జి, హువావే వంటి దిగ్గజ సంస్థలు మడతపెట్టే ఫోన్‌ను తెచ్చేందుకు ప్రయత్నాల్లో ఉండగానే రాయొలే కార్పొరేషన్ ఈ ఫోన్‌ను విడుదల చేయడం విశేషం.
 ఫీచర్స్:
 20 +16 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరాలు,  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8150 ప్రాసెసర్, 6జిబి ర్యామ్, 8 జిబి ర్యామ్‌తో 128 జిబి/256 జిబి/512 జిబి ఆన్‌బోర్డ్ స్టోరేజీ వేరియంట్లు, 3,800 ఎంఎహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.
Royole launched flexpie foldable smartphone in china

Comments

comments