Home వికారాబాద్ ఆర్‌పిల సమ్మె బాట..

ఆర్‌పిల సమ్మె బాట..

RP Employees Strike Infront Of Municipal Office

తాండూరు టౌన్‌ః తమ సమస్యలను పరిష్కరిచాలని కోరుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కింద విధులు నిర్వహిస్తున్న ఆర్‌పిలు సమ్మెబాట పట్టారు. తాండూరు మున్సిపల్‌లో విధులు విధులు నిర్వహిస్తున్న ఆర్‌పిలు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మె చేపట్టారు. ఆర్‌పిలకు గౌరవ వేతనం అందించాలని,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని జిల్లా మున్సిపల్ కమీషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్‌కు సైతం వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు.ప్రభుత్వం స్పందించక పోవడంతోనే తాము సమ్మెకు దిగామని ఆర్‌పిలు తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన కోసం తమతో వివిధ పనులు చేయించుకుంటున్నారని, కనీస వేతనం మాత్రం అందించడం లేదని అన్నారు. ఇచ్చే రెండువేల వేతనంతో పూట గడవడం కష్టమారిందన్నారు.ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తమకు నెలకు రూ.10.500గౌరవ వేతనం అందించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పిల అధ్యక్షకార్యదర్శులు వనజ,సుజాత,కోశాధికారి లక్ష్మిలతో పాటు ఆర్‌పిలు ఉన్నారు.