Home గాసిప్స్ ‘ఆర్ఆర్ఆర్’కు భారీ డీల్..?

‘ఆర్ఆర్ఆర్’కు భారీ డీల్..?

RRR Movie‘బాహుబలి’ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన దక్షిణాది అగ్ర దర్శకుల్లో ఒకరైన దర్శకధీరుడు రాజమౌళి తన తరువాతి ప్రాజెక్టును సైతం భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్'(వర్కింగ్ టైటిల్) చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ మూవీ హక్కుల కోసం ఇప్పటినుండే పోటీపడుతున్నారు బయ్యర్లు. అంతగా ఈ సినిమాకు మార్కెట్ లో డిమాండ్ పెరిగిపోయింది. పనిలో పనిగా శాటిలైట్ హక్కులకు సైతం అప్పుడే భారీ డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం.
ఇక జక్కన్న దర్శకత్వ పటిమ, చెర్రీ-తారక్ ల క్రేజీకాంబినేషన్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ పూర్తికావటానికి ఇంకా చాలా సమయమున్నా ఇప్పుడే ఈ చిత్ర శాటిలైట్ హక్కుల కోసం పలు టెలివిజన్ ఛానెల్స్ పోటీ పడుతున్నాయట. ఈ మేరకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న జీ నెట్ వర్క్స్ సంస్థ వారు తెలుగు, తమిళ, హిందీ శాటిలైట్ హక్కుల కోసం ఏకంగా 150 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక డీల్ కూడా టెంటింగ్ గా ఉండడంతో  నిర్మాత దానయ్య  కూడా సుముఖత వ్యక్తపరిచినట్లు సమాచారం. కాగా, దక్షిణాది సినిమాలకు సంబంధించి ఇది పెద్ద రికార్డ్ గా నిలవడం ఖాయం. ఇంతకుముందు ప్రముఖ దర్శకుడు శంకర్, రజినీకాంత్ కాంబోలో ఇటీవల విడుదలైన ‘2.0’ చిత్రం శాటిలైట్, డిజిటల్ హక్కులు అన్ని భాషలకు కలిపి రూ.108 కోట్లకు అమ్ముడు పోయాయి. అయితే, ఇప్పుడు ఆ రికార్డ్ ని ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
RRR Movie Satellite Rights gets High Deal?