Home తాజా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘RRR’ పిక్స్..

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘RRR’ పిక్స్..

హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. కాగా,
‘ఆర్ఆర్ఆర్’ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ చిత్రంపై పలు రకరకాల రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు 1940 బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ ఉంటుందని.. ఇందులో ఎన్టీఆర్ బందిపోటుగా, రామ్ చరణ్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అధికారిగా ఉంటారని రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా లీక్ అయిన షూటింగ్ ఫొటోలు ఈ రూమర్స్‌కి బలాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి.
తాజాగా లీకైన పిక్స్‌ని బట్టి చూస్తే ఇది రూమర్ కాదని, అక్షరాలా నిజమేనని తెలుస్తోంది. పిక్స్‌ని బట్టి చూస్తే.. ఇది పిరియాడికల్ మూవీ అని, స్వాతంత్ర్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు స్పష్టమవుతోంది. లీకైన ఫోటోల్లో పోలీస్ స్టేషన్ సెట్‌ ఒకటి కనిపిస్తోంది. ఆ పోలీస్ స్టేషన్ ఎదుట బ్రిటీష్ వాళ్ల ఫ్లాగ్ కనిపిస్తోంది. సినిమాలో నటించే వారి వేషధారణ నాటి పరిస్థితులకు అద్దం పడుతోంది. సెట్‌లో చెర్రీ పిక్ కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

#RRR movie shooting Pics leaked