Home తాజా వార్తలు ఏడుపాయల జాతర.. రూ. కోటిన్నర విడుదల

ఏడుపాయల జాతర.. రూ. కోటిన్నర విడుదల

Edupayala-Jathara

మెదక్: జిల్లా పాపన్నపేట మండలం నాగ్‌సాన్‌పల్లి గ్రామ సమీపంలో ఉండే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఏడుపాయలులో శివరాత్రి పర్వదినం నాడు జరిగే జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ సర్కార్‌ నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల నిమిత్తం రూ. కోటిన్నర విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంజీరా నది ఏడు పాయలుగా చీలి మళ్ళీ ఒకే చోట కలిసే అరుదైన ప్రదేశం ఇది. ఇక్కడే దుర్గా భవాని మాత దేవాలయం ఉంది. శివరాత్రి రోజున చుట్టు పక్కల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ జాతరకు తరలివస్తారు.