Home తాజా వార్తలు జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు…

జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు…

allam-narayanaహైదరాబాద్‌: జర్నలిస్టుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్‌ రూ.100 కోట్లు కేటాయించారని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 16వేలకు పైగా అక్రిడేషన్లు ఇచ్చామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నజర్నలిస్టులకు కూడా అక్రిడేషన్‌ ఇచ్చామని తెలిపారు. డెస్క్‌ అక్రిడేషన్‌ తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఇచ్చామన్నారు. అందులో మహిళా జర్నలిస్టులకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు ఇచ్చామన్నారు. అక్రిడేషన్ లేని వాళ్లకు కూడా హెల్త్‌ కార్డులు ఇవ్వనున్నామని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులు అందరూ హెల్త్ కార్డులు తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నమని అల్లం నారాయణ పేర్కొన్నారు.