Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

థాంక్యూ మై లవ్

mb

‘భరత్ అనే నేను’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఎంతో సంతోషంగా ఉన్నాడు. కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ అందుకోవడం విశేషం. ఇప్పటికే యుఎస్‌లో ఈ సినిమా డాల్లర వర్షాన్ని కురిపిస్తోంది. రెండు మిలియన్ డాలర్లను అందుకొని నాన్ బాహుబలి రికార్డును బ్రేక్ చేసింది. కలెక్షన్ల వర్షం ఇలాగే కొనసాగితే ‘భరత్ అనే నేను’ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. ఇక ఈ చిత్రం విజయంలో వ్యక్తిగతంగా తనకు అండగా నిలిచిన భార్య నమ్రతా శిరోద్కర్ పాత్ర చాలా ఉందని తాజాగా మహేశ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో తన సతీమణి నమ్రతకు ముద్దుపెడుతూ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘థాంక్యూ మై లవ్’ అని మహేశ్ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రొమాంటిక్‌గా ఉన్న ఆ ఫొటోను చూసి అభిమానులు ఎవరికి నచ్చినట్టుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొదటిసారి మహేష్‌తో నమ్రత నటించిన ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆతర్వాత వీళ్లిద్దరూ పెళ్లిచేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఇద్దరి పిల్లల బాధ్యతలతో పాటు మహేశ్ సినిమా వ్యవహారాలు కూడా జాగ్రత్తగా చూసుకుంటోంది నమ్రత. ఇక ‘భరత్ అనే నేను’ సినిమా ప్రమోషన్ విషయంలోనూ నమ్రత చాలా యాక్టివ్‌గా వర్క్ చేసినట్టు షూటింగ్ సమయంలోనే వార్తలు వచ్చాయి.
మైత్రీ మూవీ మేకర్స్‌తో 26వ చిత్రం…
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎంలు మహేశ్‌తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మహేశ్ 26వ చిత్రంగా తెరకెక్కే ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం ప్రారంభమై 2019లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.

Comments

comments