Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

గూగుల్‌పై రూ.136 కోట్ల జరిమానా

ggl

న్యూఢిల్లీ : నిబందనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై దేశీయ యాంటిట్రస్ట్ వాచ్‌డాగ్ కొరఢా ఝులిపించింది. గూగుల్‌పై రూ.136 కోట్ల జరిమానాను విధించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ పక్షపాత విధానాలను అవలంభించిందని సిసిఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) పేర్కొంది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెల్ కంపెనీ వెబ్‌సెర్చ్‌లో, అడ్వర్టెయిజ్‌మెంట్స్‌లో పైచేయి సాధించేందుకు ప్రయత్నించిందని, ఈ కారణంగా పోటీ సంస్థలు, వినియోగదారులు నష్టపోయారని సిసిఐ చెప్పింది. ఈ మేరకు గూగుల్‌కు రూ. 136 కోట్ల జరిమానా విధించినట్లు వెల్లడించింది. అరవై రోజుల్లోగా గూగుల్ ఈ జరిమానాను చెల్లించాల్సివుంటుందని చెప్పింది. సెర్చింగ్‌లో పక్షపాత వైఖరి విషయమై విమర్శలు గతం నుంచి ఉన్నాయి. వాటిని బహిరంగం చెప్పి పోరాటం చేసే వారు లేరు. అయితే తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Comments

comments