Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రూ. 2.50 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు

Rs 2.50 Crore Start With Working Women's Hostel

మన తెలంగాణ / సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.లు 2.50 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర మహిళా కార్పోరేషన్ చైర్మన్,ఎంపి గుండు సుధారాణి అన్నారు. బుధవారం సిరిసిల్లలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మాత్రం మహిళా ప్రాంగణాలు ఉన్నాయని, మిగిలిన 21 జిల్లాల్లో కూడా మహిళా ప్రాంగనాలు నిర్మిస్తామన్నారు. సిరిసిల్లలో మహిళా బీడి, పవర్‌లూం కార్మికులు ఉన్నందున వారికోసం జూకి కుట్టుశిక్షణ, బ్యూటీషియన్ శిక్షణనిచ్చి వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. యువతులకు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి యుధ్ద విద్యల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు.
ఆరోగ్యవంతమైన తల్లి ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుందనే ఉద్దేశ్యంతో 108, సఖీ, షీ టీంల వంటి సేవలు వినియోగిస్తున్నామన్నారు. మహిళా కార్పోరేషన్‌కు 70 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, కౌన్సిలర్లు గడ్డం లత, గుండ్లపెల్లి పూర్ణచందర్, గుజ్జె తార తదితరులు పాల్గొన్నారు.

Comments

comments