Home తాజా వార్తలు తొమ్మిదో రోజూ పెట్రో మంట

తొమ్మిదో రోజూ పెట్రో మంట

petrol

 రూ.2కు పైగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర

 చెన్నైలో రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్ ధర

ఇతర మెట్రోల్లో దాదాపు 30 పైసల పెరుగుదల

చెన్నై: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వరుసగా తొమ్మిదో రోజూ పెరిగాయి. అయితే ఈ 9 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరపై రూ. 2కు పైగా పెరగడం గమనార్హం. ఆయా నగరాల్లో మంగళవారం పెట్రోల్‌పై 29 నుంచి 32 పైసలు, డీజిల్‌పై 26 నుంచి 28 పైసలను చమురు సంస్థలు పెంచాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబయి నగరాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ధరను తాకి నపెట్రోల్ ధర ఇప్పుడు తాజాగా చైన్నైలో రికార్డు స్థాయి ధరకు చేరుకుంది. చెన్నైలో మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు రూ. 79.79 అయింది. చెన్నైలో ఇదివరకున్న రూ. 79.5 రికార్డు స్థాయి ధరను అధిగమించింది. ఇ దిలా ఉండగా నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో మంగళవారం పెట్రోల్ ధరలు 30 పైసల మేరకు పెరిగింది. ఢిల్లీ లో లీటరు పెట్రోల్ ధర రూ. 76.57 నుంచి రూ. 76.87 కు, ముంబయిలో రూ. 84.40 నుంచి రూ. 84.70కు పెరిగింది. కాగా కోల్‌కతాలో 29 పైసలు పెరిగి ఐదు సంవత్సరాల గరిష్ఠ ధర రూ. 79.53కు పెరిగింది. చెన్నై లో మంగళవారం 32 పైసలు పెరిగి లీటరు పెట్రోల్ రూ. 79.47 అయింది. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, దేశంలో ఎక్సైజ్ సుంకం అత్యధికంగా ఉండడానికి తోడు రవాణా చార్జీలు కూడా బాగా పెరిగాయి. ఇప్పటికే అత్యధిక ధర ఉన్న డీజిల్ దేశవ్యాప్తంగా కొత్త రికార్డులు నెలకొల్పింది. లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ. 68.08, కోల్‌కతాలో రూ.70.63, ముంబయిలో 72.48, చెన్నైలో రూ. 71.87గా ఉన్నాయి. గత ఏడాది జూన్ నుంచి రోజువారీ ధరల సవరణ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల 19 రోజుల పాటు ధరల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేదు. ఆ తర్వాత మళ్లీ ఈ నెల 14 నుం చి చమురు సంస్థలురోజువారీ మార్పులు చేస్తున్నాయి. అప్పటి నుంచి వరుసగా 9వ రోజు మంగళవారం ధరలను పెంచాయి.ఫిక్కీ, అసోచామ్ వంటి వివిధ సంస్థలు ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని, ఆటోమొబైల్ ఇంధనాన్ని వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) కిందికి తేవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా పెరుగుతున్న ఇంధన ధరలను నిలువరించడానికి ప్ర భుత్వం యోచిస్తోందని పెట్రోలియం శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ సోమవారం చెప్పారు.
ఈ వారంలోనే ఊరట?
పెరుగుతున్న ఇంధన ధరలు సంక్షోభాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటి నివారణకు ఈ వారం కొన్ని చర్యలు చేపట్టనున్నది. ఈ విషయాన్ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అమ్మకం ధరలో నాలుగోదైన ఎక్సైజ్ సుంకాన్ని మాత్రమే తగ్గించడం ద్వారా ధరను నియంత్రించడం సాధ్యమన్న దానిని ప్రభుత్వం విశ్వసించడంలేదని ఆ అధికారి చెప్పారు. అయితే ఆయన దీనిపై ఎక్కువ వివరణ ఇవ్వలేదు. పెరుగుతున్న ముడి చ మురు ధర సం క్షోభంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మంత్రి త్వ శాఖను సంప్రదిస్తోందని కూడా తెలిపా రు. స్థానిక పన్నులు లేక వ్యాట్ వంటి వాటి కారణంగా ఆయా రాష్ట్రా లో వేర్వేరు ధరలు ఉన్నాయి. మెట్రో నగరాల్లో అతి తక్కువ ధర ఢిల్లీలోనే ఉంది. చిల్లర ధరలో కేంద్ర, రాష్ట్రాల వ్యాట్ 20 నుంచి 35 శాతం ఉంటోంది. ఈ నేపథ్యంలో ‘పెరుగుతున్న చమురు ధరలను పరిష్కరించడానికి ఈ వారం కొన్ని చర్యలు తీసుకోనున్నది’ అని ఆ అధికారి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ. 19.48, లీటరు డీజిల్‌పై రూ. 15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తోంది. 2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తొమ్మిదిసార్లు పెంచింది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలో రూపాయి తగ్గించినా ప్రభుత్వానికి ఆదాయంలో రూ. 13,000 కోట్ల నష్టం రానుంది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడానికి బదులు కేంద్ర వ్యాట్‌ను తగ్గించాల్సిందిగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలను కోరింది. కాగా డాలరు మారకంతో 16 నెలల కనిష్ఠానికి రూ. 67.97కి పడిపోయిన రూ పాయి విలువ కూడా పెరిగిన చమురు బిల్లులో కీలక పాత్రను పోషిస్తోంది.