Search
Friday 21 September 2018
  • :
  • :

రూ. 2000 నోటు చెల్లుబాటు ఈ మార్చి 31 వరకే…!!?

Rs2000Note

రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో కరెన్సీ చెలామణి కోసం కొత్తగా రెండు వేల రూపాయల నోటును విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్. అయితే, రెండు వేల రూపాయల నోటుకు చిల్లర దొరక్క దేశ ప్రజలు ఇక్కట్లను గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు రెండు వేల నోటును కూడా బ్యాన్ చేయడానికి సమాయత్తమవుతుందా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా ఉన్నాయి.

అఖిల భారత స్టేట్ బ్యాంక్ అధికారుల సంఘం అధ్యక్షుడు థామస్ ఫ్రాంకో ఓ సమావేశం లో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రెండు వేల నోటు రద్దు పై బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఈ మార్చి 31 లోగా… రూ. 2000 నోటును కేంద్రం రద్దు చేసే అవకాశం ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డాడు. ఇంకా.. రద్దయిన రూ. 500, 1000 నోట్లపై కూడా ఆయన మాట్లాడాడు. నోట్ల రద్దు అంశం.. రహస్యమేమీ కాదని.. బడాబాబులకు ముందే తెలుసన్నాడు.

థామస్ అభిప్రాయం ప్రకారం.. నిజంగా ఈ మార్చి 31 లోగా రూ. 2000 నోటు నూ రద్దు చేస్తే.. మళ్లీ దేశ ప్రజలకు కేంద్రం, ఆర్బీఐ ఎటువంటి ఆప్షన్లను ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Comments

comments