Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నేరం రుజువైతే రూ.25 కోట్ల జరిమానా

chand

ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ కొచ్చర్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విధించే అవకాశం 

న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు రుణం మంజూరు కేసులో మోసం రుజువైనట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ చందా కొచ్చర్‌పై గరిష్ఠంగా రూ.25 కోట్ల జరిమానాను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విధించే అవకాశముంది. కొనసాగుతున్న దర్యాప్తులో కొచ్చర్, బ్యాంక్‌లు నిబంధనలు పాటించడలేదని గుర్తిస్తే గనుక.. సెబీకి భారీ జరిమానా విధించే అధికారం ఉందని మింట్ రిపోర్ట్‌లు చెబుతున్నా యి. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ చీఫ్‌గా ఆమె రాజీనామాను సెబీ కోరకపోవచ్చని, జరిమానా విధిస్తే గనుక రూ.25 కోట్ల భారం పడనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. వీడియోకాన్‌కు ఐసిఐసిఐ బ్యాంకు ఇచ్చిన రుణం వ్యవహారంలో కొ చర్‌కు, బ్యాంకుకు సెబీ నోటీసులు జారీచేసింది. ఆరోపణలపై దిగొచ్చిన ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇప్పటికే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఒకవేళ ఈ విచారణలో చందా కొచర్‌తప్పు చేసినట్టు రుజువైతే.. ఆమె సెబీ నుంచి భారీ మొత్తంలో పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సెబీ జారీచేసిన నోటీసు ప్రకా రం ఐసిఐసిఐ బ్యాంకు టాప్ ఎగ్జిక్యూటివ్‌ను ఆ పదవి నుం చి దిగిపోవాలని ఆదేశించే హక్కు లేదు. భారీ మొత్తంలో పెనాల్టీ విధించే అవకాశముందని రిపోర్టు పేర్కొంది. ఈ జరిమానా గరిష్టంగా రూ.25 కోట్లు లేదా లబ్ది పొందిన మొత్తంలో మూడింతలు ఉంటుందని తెలిపింది. చందా కొ చర్ కేసులో ఎంత జరిమానా విధించాలనే విషయంపై సెబీ న్యాయనిర్ణేత అధికారి ఆదేశాలపైనే ఆధారపడి ఉంటుంది. వీడియోకాన్‌కు రుణాలు జారీచేసిన లావాదేవీల వివరాలను వెల్లడించే విషయంలో లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సెబీ తన నోటీసుల్లో పేర్కొంది. కాగా  వీడియోకాన్‌కు ఐసిఐసిఐ బ్యాంక్ రుణంపై వచ్చిన ఆరోపణలపై అమెరికా మార్కెట్ రెగ్యులేటరీ సెక్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ ఆరోపణలపై మారిషస్ స్వతం త్ర దర్యాప్తు చేస్తుండగా.. విదేశీ సంస్థలు నుంచి సహకారం తీసుకునేందుకు సెబీ వంటి దేశీయ దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు అమెరికాలో కూడా లిస్ట్ కావడంతో అక్కడి రెగ్యూలేటరీ పరిధిలోకి వెళ్లింది. దీంతో భారత్‌లో వస్తున్న ఆరోపణలు, దర్యాప్తు అంశాలను సెక్ జా గ్రత్తగా గమనిస్తోంది. సెబీ నుంచి సెక్ మరిన్ని వివరాలను తెప్పించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్‌లో కొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా నిఘా పెట్టింది. వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ రుణాలతో ప్రయోజనం పొందిన వీడియోకాన్ సంస్థ నూపవర్ రెనీవబుల్‌లో పెట్టుబడులు పెట్టింది. ఈ నూపవర్ సంస్థ చందాకొచ్చర్ భర్త దీపక్ సంస్థ అనే విషయం తెలిసిందే.

Comments

comments