Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

రూ. 270 తగ్గిన పసిడి ధర

Gold Slumps By Rs 300 On Weak Global Cues Low Demand

 నగల వర్తకుల నుంచి తగ్గిన డిమాండ్

న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్‌లో మంగళవారం  బంగారం ధర రూ. 270 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 31,380 వద్ద ట్రేడయింది. విదేశీ మార్కెట్‌ల బలహీన పోకడ, దేశీయంగా స్థానిక నగల వర్తకుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర పతనమైంది. బంగారం బాటలోనే వెండి కూ డా రూ. 100 తగ్గి కిలో వెండి రూ. 40,650  ధర పలికిం ది. అమెరికా డాలరు కోలుకోవడంతో బంగారం కొనే సెంటిమెంట్ తగ్గిందని వ్యాపారవర్గం తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ భయాలు, బ్రెగ్జిట్‌పై రాజకీయ అనిశ్చితి నష్టాలని పరిమితం చేశాయి. ప్రపంచ మార్కెట్‌లో బంగారం 0.09 శాతం పతనమై సింగపూర్‌లో ఔన్స్ బంగారం 1,256.10 అమెరికా డాలర్లు, వెండి ధర 0.28 శాతం పతనమై ఔన్స్ వెండి 16.03 అమెరికా డాలర్ల ధర పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛ బంగారం రూ. 270 పతనమై పది గ్రాములు రూ.31,380 వద్ద, 99.5 శాతం స్వ చ్ఛ బంగారం పది గ్రాములు రూ. 31,230 వద్ద ట్రేడయ్యా యి. కాగా సావరిన్ బంగారం రూ. 50 పెరిగి ఎనిమిది గ్రాములు రూ. 24,800 వద్ద ధర పలికింది. ఇదిలా ఉం డగా వెండి నాణేల ధరలో మాత్రం ఎలాంటి మార్పులేక 100 పీసుల అమ్మకం ధర రూ. 76,000. కొనుగోలు ధర రూ. 75,000 వద్ద ట్రేడయ్యాయి.

Comments

comments