Home టెక్ ట్రెండ్స్ ‘రెడ్‌మీ నోట్‌ 5 ప్రో’పై భారీ డిస్కౌంట్

‘రెడ్‌మీ నోట్‌ 5 ప్రో’పై భారీ డిస్కౌంట్

 

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారుదారు షావోమీ తన యూజర్లకు తీపి కబురు అందించింది. #High5 క్యాంపైన్ పేరుతో ‘రెడ్‌మీ నోట్‌ 5 ప్రో’ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఏకంగా రూ.4,000 తగ్గించి స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. షావోమీ  4జిబి+64జిబి మోడల్ ధరను రూ.15,999 నుంచి రూ.12,999 తగ్గించగా.. 6జిబి+64జిబి ధరను రూ.17,999 నుంచి రూ.13,999 తగ్గించింది.

షావోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రో ఫీచర్స్:

5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 2160×1080 పిక్సెల్
4 జిబి, 6 జిబి ర్యామ్ వేరియంట్లు
64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
స్నాప్‌డ్రాగన్ 636, 1.8 గిగాహెర్జ్ ప్రాసెసర్
12+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4000 ఎంఎహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 7.1.1
డ్యూయెల్ సిమ్ సపోర్ట్

  Rs 4000 Discount on Xiaomi Redmi Note 5 pro