Search
Thursday 15 November 2018
  • :
  • :

గుంట భూమి రైతు కుటుంబానికి రూ.5లక్షలు

Rs.5 lakh for the farmer family

రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ గ్రామంలో మరణించిన రైతు భార్యకు రైతుబంధు బీమా చెక్కు అందజేత

మన తెలంగాణ /రంగారెడ్డి : రైతన్నల కుటుంబాలకు భరోసా కల్పించడం కోసం సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు సామూహిక బీమా పథకం కింద జిల్లాలో మొదటి లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ గ్రామంలో జరిగిన కార్యక్రమం లో ఇటీవల మరణించిన రైతు కట్టా ఈశ్వరయ్యగౌడ్ భార్య లావణ్యకు ఐదు లక్షల రూపాయల చెక్కును రాజేంద్రనగర్ ఎంఎల్‌ఎ ప్రకాష్‌గౌడ్‌తో కలిసి గురువారం అందజేశారు. మరణించిన రైతు ఈశ్వరయ్య పేర కేవలం ఒకే ఒక్క గుంట భూమి ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నదే సిఎం కెసిఆర్ లక్షం అని పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు బీమా కల్పించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని అన్నారు.

వ్యవసాయదారులు కుటుంబంలో కెసిఆర్ పెద్దన్నగా మారి వారి మంచి చెడులు చూస్తూ నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం వారికి ఎకరాకు ఏటా ఎనిమిది వేల రూపాయలు అందజేస్తున్న గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేసి సరియైన సమయంలో విత్తనాలు, ఎరువులు అందించిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వం అని వివరించారు. అదేవిధంగా శంకరాపురం గ్రామానికి చెందిన రెడ్డి బల్వంత్‌రెడ్డి అనే రైతు మరణించగా ఆయన భార్యకు అయిదు లక్షల రూపాయల బీమా చెక్కును రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వంగేటి లకా్ష్మరెడ్డి, వ్యవసాయ శాఖ జెడి గీతారెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రారెడ్డి, పార్టీ నాయకులు దూడల వెంకటేష్, మహేందర్‌రెడ్డి, జిట్టెసిద్దులు, ఇస్తారి, మేకల వెంకటేష్ ముదిరాజ్, నీరటి రాజు, దవనాకర్‌గౌడ్, కొమ్మురి మనోహర్‌గౌడ్, ఆర్ సురేష్, సుదర్శన్, చంద్రాచారి, జ్యోతిరవి, క్రిష్ణకుమార్, మోహన్‌రావు, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments