Search
Sunday 23 September 2018
  • :
  • :

నకిలీ విత్తనాలకు అవినీతి… మకిలి

fake-seeds

మనతెలంగాణ/గదాలప్రతినిధి: రూ.6.50కోట్ల నకిలీ విత్తనాలు.. గద్వాలలో నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతుంది. ప్రధానంగా గద్వాల, శాంతిన గర్, అయిజ, మల్దకల్, ధరూరు, గట్టు వంటి ప్రాంతాలు నకిలీ విత్తనాలకు కేం ద్రాలుగా మారాయి. గతంలో వ్యవసాయ, రెవె న్యూ శాఖల అధికారులు జరి పిన సంయుక్త దాడుల్లో పలుమార్లు కోట్లు విలువ చేసే నకిలీ విత్తనాలు వెలుగు చూశాయి. ఇదే క్రమంలో ఈఎడాది జనవరిలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు రూ. 6.50కోట్ల విలువ కలిగిన నకిలీ పత్తివిత్తనాలను పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. అయితే వీటిని వ్యవసాయ శాఖలో ఉన్న పాత నిబంధనల వెసులుబాటును సా కుగా చూపెట్టి గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించారనే ప్రచారం వ్యవ సాయ శాఖలోనే జోరుగా సాగుతుంది. ఇలా నకిలీ విత్తనాలను పక్కదారి పట్టిం చేందుకు రూ.లక్షల్లోనే చేతులు మారినట్లు…. దీనికి వెన కాల వ్యవసాయ శాఖ లో ఉన్న ఓఅవినీతి అధికారి కీలకపాత్ర పోషించి నట్లు బహటంగానే చర్చించు కుంటున్నారు. ఇదే విషయంపై సదరు అవి నీతి అధికారిని నిజాయితీ పరులైన అధికారులు గట్టిగా నిలదీసినట్లుగా కూడ ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఆనోట ఈ నోట పడి జిల్లాల్లో పుకార్ బజారులో షికారు చేస్తుంది.
పక్కరాష్ట్రంలో అవినీతి అధికారిపై వేటు..:
పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాల్లో నకిలీ విత్తనాల ముఠాకు సహకరించిన ఓవ్యవ సాయ అధికారిపై ఇటివలీ అక్కడి రాష్ట్ర ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే తరహాలో గద్వాలలో జరిగిన అవినీతి భాగోతంపై కూడ రాష్ట్ర ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. వ్యవ సాయ శాఖలో 2016-17 సంవత్స రానికి సంబంధించిన ఉన్న వెసులు బాటు వెన కాల జరిగిన అవినీతి దందాపై పూర్తి స్థాయి విచారణ చేస్తు న్నట్లు తెలిసింది. గద్వాలలో ఏటా ఎన్ని టన్నుల సీడుపత్తి విత్తనాలు పండుతాయి. వాటిలో ఎంత శాతం మేర నకిలీ విత్తనాలు(ఫలవంతం కాని) పరీక్షల ద్వారా నిర్ధారణ అ య్యాయి. ఆవిత్తనాలు ఏఏ రైతులకు సంబంధించినవి … తిరిగి వాటిని ఎలా రైతులకు ఇచ్చారు. తదితర అంశాలపై కూపీలాగుతున్నట్లు సమాచారం. ఈవి షయంపై తెలుసుకున్న సదరు అవినీతి వ్యవసాయ అధికారి గుండెల్లో దడ మొ దలైనట్లు… ఈఅవినీతి మకిలీ నుంచి తప్పించుకు నేందుకు తనకున్న పలుకుబ డిని ఉపయోగించుకుంటూనే… మరోవైపు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లి తప్పిం చుకునే యోచనలో ఉన్నట్లు తెలి సింది. చూడాలి మరి నకిలీ విత్తనాల వెనకాల ఉన్న అవినీతి మకిలీని కడిగేస్తారో లేదో…?
జిల్లా అధికారి ఏమన్నారంటే..: ఈవిషయంపై జిల్లా వ్యవసాయ అధికారి గో విందునాయక్‌ను వివరణ కోరగా… జనవరి మాసంలో దొరి కిన నకిలీ విత్తనా ల్లో ఒకలాట్‌లో బీటీ-3 విత్తనాలున్నట్లు తేలింది. వాస్త వానికి శాస్త్రీయంగా (బీటీ-3అనే పేరు కూడ సరైంది కాదు). మిగిలిన నకిలీ విత్తనాలను వ్యవసాయ శాఖలోని పాత నిబంధనల మేరకు సదరు కంపెనీకి తిరిగి ఇవ్వడం జరిగింది. ఎవరైన నకిలీ విత్తనాలను మార్కెట్‌లో విక్రయిస్తే వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసు కుంటామంటూ మనతెలంగాణకు వివరణ ఇచ్చారు. అయితే నకిలీ విత్తనాలు ఏఏ రైతులకు ఇచ్చారు.. వారి వివరాలు ఉన్నాయా..? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదు.

Comments

comments