Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రూ. 6630 కోట్ల  విజయ్ మాల్యా ఆస్తుల జప్తు

vijaymalliaమరోసారి ఇడి కొరడా

న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలను చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్తపై ఇడి(ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మరోసారి కొరఢా ఝులిపించింది. రెండోసారి మాల్యా ఆస్తులను ఇడి జప్తు చేసింది. తాజాగా మాల్యాకు చెందిన రూ.6,630 కోట్ల విలువచేసే ఆస్తులను ఇడి స్వాధీనం చేసుకుంది. వీటిలో షేర్లు, మాల్యాకు చెందిన వ్యక్తిగత ఆస్తులు ఉన్నాయి. ముంబయి, బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లోని ఆయన అస్తులు జప్తు చేసినట్లు ఇడి ప్రకటించింది. 2010లో వీటి విలువ ఆధారంగా జప్తు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుత ధర ల ప్రకారం వీటి విలువ మార్కెట్ ఆధారంగా రూ.6,630 కోట్లు ఉంటుందని అంచనా. ఇడి ఇటీవల మాల్యాపై విచారణను వేగవంతం చేసింది. కొద్ది నెలల క్రితం రూ.1,411 కోట్ల విలువచేసే ఆస్తులను కూడా జప్తు చేసిం ది. దీంతో ఇడి స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ రూ.8,044 కోట్లకు చేరింది. ఇడి జప్తు చేసిన ఆస్తుల్లో మహారాష్ట్రలో ఉన్న మాల్యా ఫామ్ హౌస్ ఉండ గా, దీని విలువ రూ.200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరులో రూ.800 కోట్లు విలువైన మాల్, అపార్ట్‌మెంట్ ఉన్నాయి. యుబిఎల్, యుఎస్‌ఎల్ లోని రూ.3000 కోట్లు విలువైన వాటాలు ఉన్నాయి. బ్యాంకుల అప్పులు ఎగవేసేవారికి బలమైన సందేశం పంపేలా చర్యలు తీసుకోవాలని, అప్పులు ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇడి తాజాగా పిఎంఎల్‌ఎ(మనీ లాండరింగ్ నిరోధక చట్టం) కింద మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యునై టెడ్ బ్రువరీస్ హోల్డింగ్స్(యుబిహెచ్‌ఎల్), ఇతరులపై కేసు నమోదు చేసింది. ఐడిబిఐ మనీలాండరింగ్ కేసులో మాల్యాకు చెందిన రూ.1411 ఆస్తులను ఇడి జప్తు చేసింది. ఈ ఏడాది మా ర్చి 13న మాల్యా ఉద్దేశ పూర్వంగా రుణాలను ఎగ్గొట్టినట్టు ముంబై కోర్టు తేల్చి చెప్పింది. అలాగే చెక్ బౌన్స్ కేసు లో ఎఎఐ దాఖలు చేసిన పిటిషన్‌పై దర్యాప్తుకు హాజరుకాని మాల్యాపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే అనేక కేసులు, వారెంట్లతో సతమతమవుతున్న మాల్యా ప్రత్యేక పిఎంఎ ల్‌ఎ కోర్టులో హాజరు కావాల్సి ఉండగా రాలేదు. బ్రిటన్‌కు పరారయిన మాల్యా విచారణకు హాజరు కాకపోవడంపై కోర్టు సీరియస్‌గా ఉంది. అదే సమ యంలో ఇడి ఆయన స్థిర, చరాస్తులు, తనఖా పెట్టిన వాటాలను గుర్తించగా, మాల్యా కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేసింది. బ్యాం కులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు మాల్యా వివరాలను వెల్ల డించాలని గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే ట్ లేఖలను రాసింది. మాల్యాను భారత్ రప్పించడంలో విఫలమైన నేపథ్యం లో ఆయన ఆస్తులను బ్యాంకులు వేలం వేశాయి. ఇంతకుముందు వేలం నిర్వ హించినా రిజర్వు ధర ఎక్కు వగా ఉండడం వల్ల బిడ్డర్లు రాలేదు. మరోసారి తక్కువ రేటుతో విక్రయం చేపట్టేందుకు బ్యాంకులు సిద్ధమ య్యాయి.

Comments

comments