Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నిరాశపర్చిన ఎయిర్‌టెల్

 airtel

క్యూ4లో రూ.83 కోట్ల నికర లాభం
 గతేడాదితో పోలిస్తే 78 శాతం క్షీణత

న్యూఢిల్లీ: దేశీయ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లోనూ నిరాశపర్చింది. రిలయన్స్ జియో టెలికామ్ మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఎయిర్‌టెల్ దారుణంగా నష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. తాజాగా సంస్థ నికర లాభం 78 శాతం క్షీణించి రూ.83 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.373.40 కోట్లుగా ఉంది. అలాగే ఇంతకుముందు 2017 క్యూ3(అక్టోబర్‌డిసెంబర్)లో ఎయిర్‌టెల్ నికర లాభం 305 కోట్లు నమోదైంది. ఎటూ చూసినా కంపెనీ లాభం ఈసారి భారీగా క్షీణించింది. కృత్రిమంగా అణచివేసిన ధర, అంతర్జాతీయ టర్మినేషనల్ రేట్ల తగ్గింపు అత్యంత దిగువకు చేరిన కారణంగా నష్టాలొచ్చాయని కంపెనీ విమర్శింది. బ్రోకరేజ్ సంస్థలు నికర నష్టం రూ.380 కోట్లు నమోదవుతుందని అంచనా వేయగా, ఇందుకు విరుద్ధంగా సానుకూలంగానే ఫలితాలు ఉన్నా.. నష్టాల్లోనే కంపెనీ కొనసాగుతోంది. కంపెనీ ఆదాయం కూడా 10.48 శాతం తగ్గి రూ.19,634 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.21,934 కోట్లుగా ఉంది. స్టాండలోనే బేసిస్ క్యూ4లో నికర నష్టం రూ.760 కోట్లు నమోదవగా.. 2017లో ఇది రూ.14,176 కోట్లుగా ఉంది. డిసెంబర్ ముగింపు నాటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.64 కోట్లు నమోదైంది. వాయిస్, డేటా కలిసి దేశీయ అర్పు(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్) 27 శాతం పడిపోయింది. 201718 ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీకి రూ.2.50 తుడి డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది.
ధరల అణచివేత కొనసాగుతోంది: సిఇఒ గోపాల్ విఠల్
ఎయిర్‌టెల్ ఎండి, సిఇఒ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విఠల్ మాట్లాడుతూ.. వ్యయం కంటే దిగువ రేట్లు, కృత్రిమంగా అణచివేసిన ధరలు టెలికామ్ పరిశ్రమలో కొనసాగుతున్నాయని అన్నారు. ఇది పరిశ్రమ ఆదాయంపై దారుణంగా ప్రభావం చూపిస్తోందని.. అంతర్జాతీయ టర్మినేషన్ రేట్లలో తగ్గింపు వల్ల ఈ త్రైమాసికంలో నష్టమేర్పడిందని అన్నారు.
లాభం తగ్గినప్పటికీ..
భారతీ ఎయిర్‌టెల్ నికర లాభం 78 శాతం క్షీణించి రూ.83 కోట్లు నమోదైంది. గత ఏడాది క్యూ4లో లాభం రూ.373 కోట్లు.. అలాగే ఇంతకుముందు 2017 క్యూ3 (అక్టోబర్‌డిసెంబర్)లో నికర లాభం 305 కోట్లు నమోదైంది. మొత్తం రెవెన్యూ, ఎబిటా కూడా వార్షికంగా చూ స్తే 10.50 శాతం తగ్గింది. అయితే విశ్లేషకుల అంచనాల తో పోలిస్తే ఫలితాలు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. కృత్రిమంగా అణచివేసిన ధర, అంతర్జాతీయ టర్మినేషనల్ రేట్ల తగ్గింపు కారణంగా నష్టాలొచ్చాయని కంపెనీ అంటోంది. టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ ఇటీవల అంతర్జాతీయ టర్మినేషనల్ చార్జీలు రూ.0.53 పైసల నుంచి రూ.0.30 లకు తగ్గించింది. మొబైల్ సేవల నుంచి రెవెన్యూ 20 శాతం పడిపోయి రూ.10,353 కోట్లకు చేరింది. గతేడాదిలో ఈ ఆదాయం రూ.12,971 కోట్లుగా ఉంది. అర్పు(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్) 27 శాతం తగ్గింది.
మొబైల్ డేటా
మొబైల్ డేటా ట్రాఫిక్ గతేడాదిలో 225 బిలియన్ ఎంబిలతో పోలిస్తే ఈ త్రైమాసికంలో 1,540 బిలియన్ ఎంబిలకు పెరిగింది. అంటే ఆరు రెట్లు పెరిగిందన్న మాట. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 42.7 మిలియన్ల నుంచి 76.6 మిలియన్లకు అంటే 79.3 శాతం పెరిగారు.

Comments

comments