Home తాజా వార్తలు ఆగివున్న బోలేరాను ఢీకోట్టిన నంద్యాల ఆర్టీసీ బస్సు

ఆగివున్న బోలేరాను ఢీకోట్టిన నంద్యాల ఆర్టీసీ బస్సు

RTC-Bus-Accident

మహబూబ్‌నగర్: మండల పరిధిలోని 44వ జాతీయ రహాదారి వెల్టూర్ స్టేజి సమీపంలో సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇటిక్యాల మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కృష్ణస్వామి (28)అనే బోలేరా క్లినర్ మృతిచెందినట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. పెబ్బేరు నుండి హైదరాబాద్‌కు బియ్యం తీసుకోని వెళ్తున్న ఏపి22వై5761 నెంబర్ గల బోలేరా వెల్టూర్ స్టేజీ సమీపంలోకి రాగానే వెనుక వున్న టైర్ పంక్చర్ కావడంతో డివైడర్ పక్కనే ఆపుకొని మరో టైర్‌ను అమర్చుతుండగా వెనుక నుండి వచ్చిన కర్నూల్ జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపోకు చెందిన ఏపి29జెడ్1307 నెంబర్ గల ఆర్టీసీ బస్సు బోలేరాను ఢీకోట్టడంతో క్లినర్ కృష్ణస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి బస్సు డ్రైవర్ శేషయ్యపై కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.