Home తాజా వార్తలు లారీని ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు

లారీని ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు

Bus-Accident

కట్టంగూరు: నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు చెందిన ఆర్‌టిసి బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.