Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

బస్సు నుంచి కింద పడ్డ కండక్టర్.. (వీడియో)

rtc conductor falls off from moving bus at hyderabad

హైదరాబాద్: వేగంగా వెళ్తున్న ఆర్ టిసి సిటీ బస్సు నుంచి కండక్టర్ కింద పడిపోయిన ఘటన హైదరాబాదులోని వేవ్ రాక్ లో బుధవారం చోటు చేసుకుంది. బస్సు వెళ్తున్నసమయంలో కండక్టర్ ఫుట్ బోర్డుపై నిలబడి ఉన్నాడు. ఓ కూడలి వద్ద బస్సు టర్న్ అవుతున్నసందర్భంలో పట్టుతప్పి, ప్రమాదవశాత్తు అతడు కింద పడిపోయాడు. ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సు అపాడు. ఈ ప్రమాదంలో కండక్టర్  తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని వెంటనే  డ్రైవర్ తో పాటు, బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులు దగ్గర్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం కండక్టర్ చికిత్స పొందుతున్నాడు.

(courtesy by abn andhrajyothy)

Comments

comments