Home తాజా వార్తలు ఆర్‌టిసి ఆదాయం పెంచుతాం : మహేందర్‌రెడ్డి

ఆర్‌టిసి ఆదాయం పెంచుతాం : మహేందర్‌రెడ్డి

Mahender-Reddy

హైదరాబాద్ : టిఎస్‌ఆర్‌టిసి ఆదాయం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. టిఎస్‌ఆర్‌టిసికి 1,474 ఎకరాల భూమి ఉందని ఆయన చెప్పారు. ఆర్‌టిసికి చెందిన స్థలాల్లో పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే దీనిపై అవగాహన ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. ఖమ్మం, కరీంనగర్ బస్టాండ్లలో మినీ థియేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 1100 కొత్త బస్సులు తీసుకున్నామన్నారు. ఎపికి ప్రస్తుతం 180బస్సులు నడుపుతున్నామని, త్వరలోనే మరో 150 బస్సులు నడపనున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆర్‌టిసి బస్సుల్లోనే ప్రయాణం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్‌టిసి బస్సుల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిపిస్తున్నామని ఆయన చెప్పారు.

RTC will Increase Revenue : Mahender Reddy